పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) – 2024 ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో వివిధ విభాగాల్లో 802 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 19, 2024 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
భర్తీ కావాల్సిన విభాగాలు:
ఎలక్ట్రానిక్, సివిల్, ఎలక్ట్రికల్, హెచ్ఆర్, ఎఫ్ & ఏ
ఖాళీల వివరాలు:
- డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్): 600 పోస్టులు
- డిప్లొమా ట్రైనీ (సివిల్): 66 పోస్టులు
- జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెచ్ఆర్): 79 పోస్టులు
- జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (ఎఫ్ & ఏ): 35 పోస్టులు
- అసిస్టెంట్ ట్రైనీ (ఎఫ్ & ఏ): 22 పోస్టులు
అర్హతలు:
ప్రతీ పోస్టుకు అనుగుణంగా డిప్లొమా, బీబీఏ, బీబీఎం, బీబీఎస్, బీకాం, ఇంటర్ సీఏ, ఇంటర్ సీఎంఏ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
2024 నవంబర్ 12 నాటికి అభ్యర్థుల వయసు 27 ఏళ్ల లోపులో ఉండాలి.
జీతం:
- అసిస్టెంట్ ట్రైనీ: రూ. 21,500 – రూ. 74,000
- ఇతర పోస్టులు: రూ. 24,000 – రూ. 1,08,000
ఎంపిక విధానం:
ఎంపిక రాత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చివరి తేది: నవంబర్ 19, 2024
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://www.powergrid.in
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇