Table of Contents
PM Surya Ghar Yojana Scheme: మీ ఇంటికి సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అప్లై చేయండి!
PM Surya Ghar Yojana Scheme: అందరికీ నమస్కారం నేను ఈ ఆర్టికల్ ద్వారా మీకు ఉచిత విద్యుత్ పథకం గురించి చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ఉచిత విద్యుత్ పొందడానికి ఇప్పుడు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు ఆ వివరాలు ఏంటో ఈ ఆర్టికల్ చదివి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇంకా ఏమైనా తాజా సంచారం & మీ డౌట్స్ కి మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి.. మాతో కాంటాక్ట్ అవ్వండి..
(PM Surya Ghar Yojana) పీఎం సూర్య ఘర్ యోజన
మన భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోని ప్రతి పేదవారు పథకాన్ని సద్వినియోగం చేసుకోగలరని కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలియజేయబడింది. ఎందుకంటే కరెంట్ బిల్లు తగ్గుతుందని లేదంటే కరెంట్ బిల్లు అసలు కట్ అవ్వద్దు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకసారి సౌర శక్తి వినియోగం ఎక్కువగా ఉంటే మీరు ఈ విద్యుత్ ను ఇంటిలో అమర్చుకొని ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి :: కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ప్రతి నెల 3,000 వేలు పెన్షన్
పీఎం సూర్య ఘర్ యోజన సౌకర్యాలు
మీరు ఈ పథకంలో లబ్ధిదారులై ఉండి నమోదు చేసుకున్నట్లయితే మీ ఇంటికి సోలార్ ప్యానల్స్ ను అమర్చుకుంటే మీకు ఐదేళ్ల నిర్వహణ హామీ కూడా లభిస్తుంది. మరియు మీరు నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదు. మరియు మీరు ఈ సోలార్ ప్యానల్స్ ను చూసుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుంది మీకు చాలా సులభం.
PM Surya Ghar Yojana Required Documents
- చిరునామా సర్టిఫికెట్
- మొబైల్ నెంబర్
- ఇంటి సర్టిఫికెట్
- ఆధార్ కార్డ్
- 6 నెలలు పాటు కరెంటు బిల్లు
- బ్యాంకు పాస్ బుక్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం ( Income Certificate )
మీరు ఈ పత్రాలను అన్నిటినీ రెడీ చేసుకుని మీ సమీపంలోని ఆన్లైన్ సెంటర్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా కింద ఇవ్వబడిన వెబ్సైట్ సందర్శించడం ద్వారా మీ మొబైల్ లోని దరఖాస్తు చేసుకోవచ్చును.
అర్హతలు ఏమిటి?
- దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి తప్పనిసరిగా భారతీయ పౌరుడై భారత దేశంలో నివసిస్తూ నివసిస్తూ ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం 1.5 లక్షల లోపు ఉండాలని కూడా పేర్కొంది.
- బ్యాంకు ఖాతా కి ఆధార్ కార్డు కి లింక్ అయి ఉండాలి. ( NPCI )
- దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థికి తప్పనిసరిగా 18 ఏళ్లు పైబడి ఉండాలి.
- దరఖాస్తుదారుడు మరియు అతని కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండరాదు.
కరెంటు అమ్ముకోవచ్చు..
ఇంటి పై ఏర్పాటు చేసుకున్న సోలార్ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో తొలి 300 యూనిట్లు లబ్ధిదారులు వివరంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకోవచ్చు. దీనివల్ల నెలకి రూ.1,265 ఆదాయం వస్తుంది. అందులో రూ. 610 నీ బ్యాంకు రుణ వాయిదా కింద జమ చేసుకుంటారు. దీనివల్ల ఏడేళ్లలో అరుణం తీరిపోతుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. 1 కిలోవాట్ కు రూ. 30 వేలు, 2 కిలోవాట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న వారికి రూ. 60 వేలు, 3 కిలోవాట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న వారికి రూ. 78 వేలు గరిష్ట రాయితీ అందుతుందని చెప్పారు.
PM Surya Ghar Yojana Apply Online
మీరు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకానికి ( pm surya ghar yojna ) ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద ఉన్న లింకును క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చును.
- Step 1 : ముందుగా మీరు పిఎం సూర్య ఘర్ యోజన పథకం అప్లై చేసుకోవాలంటే ఈ ( pmsuryaghar.gov.in ) అనే వెబ్సైట్ లో పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మీ రాష్ట్రం విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయాలి.
- Step 2 : కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి అక్కడ “రూప్ టాప్ సోలార్” కోసం అప్లై చేసుకోవాలి.
- Step 3 : దరఖాస్తు పూర్తి చేసి డిస్కౌంట్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కంలోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
- Step 4 : ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్ లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
- Step 5 : నెట్ మీటర్ ని ఇనిస్టాల్ చేశాక డిస్కం అధికారులు తనిఖీ చేస్తారు అనంతరం పోర్టల్ నుంచి కమిషన్ సర్టిఫికెట్ ఇస్తారు.
- Step 6 : ఈ రిపోర్టు పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్ చెక్కును పోర్టల్ లో సబ్మిట్ చెయ్యాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ అమౌంట్ జమవుతుంది.
Apply Online Link :: Click Here
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇