IBPS Notification 2024:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) డ్రైవర్-కమ్-ఆఫీస్ అటెండర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా నేరుగా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది. ఇంటర్మీడియట్ అర్హత ఉన్న, వయసు 40 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో 3 సంవత్సరాల పాటు ఉంటాయి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూసిన తర్వాత వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు మరియు అర్హతలు:
- పోస్టు: డ్రైవర్-కమ్-ఆఫీస్ అటెండర్
- నిర్వహణ విధానం: కాంట్రాక్టు పద్దతిలో 3 సంవత్సరాలు
- అర్హత: ఇంటర్మీడియట్ అర్హత, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, 10 సంవత్సరాల అనుభవం.
ముఖ్యమైన తేదీలు:
- ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 26, 2024
- స్థలం: ముంబైలోని IBPS కార్యాలయం.
వయస్సు ప్రమాణం:
40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్టు ఉద్యోగాలు కావున ఇతర అలవెన్సులు లేవు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపికను నవంబర్ 26న ముంబైలో IBPS కార్యాలయంలో జరిగే పర్సనల్ ఇంటర్వ్యూతో నిర్వహిస్తారు.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹28,000/- ఫిక్స్డ్ శాలరీ చెల్లిస్తారు. 3 సంవత్సరాల పాటు ఈ జీతమే వర్తిస్తుంది, అయితే అవసరాన్ని బట్టి కాంట్రాక్టు కాలం పొడిగించే అవకాశం ఉంది.
అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూకి కావాల్సిన సర్టిఫికెట్లు:
- ఇంటర్మీడియట్ అర్హత సర్టిఫికెట్
- డ్రైవింగ్ లైసెన్స్, 10 సంవత్సరాల అనుభవం సర్టిఫికెట్లు
- 10వ తరగతి మార్క్ లిస్ట్
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- కుల ధ్రువీకరణ పత్రం (కావాల్సిన అభ్యర్థులకు)
- స్టడీ సర్టిఫికెట్లు
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
దరఖాస్తు విధానం:
క్రింద ఉన్న నోటిఫికేషన్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.
Notification & Application Form
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇