
Table of Contents
AP New Ration Card Application 2025:
🔹 ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మే 7 నుండి ప్రారంభించింది. ప్రభుత్వం తాజా ప్రకటనలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే దరఖాస్తు చేసిన 3.36 లక్షల మంది తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. AP New Ration Card Application 2025 ప్రస్తుతం ఈ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
🔹 కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ప్రక్రియ
- గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
- మే 15 నుండి AP New Ration Card Application 2025 వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’ ద్వారా దరఖాస్తు అవకాశం
- అర్హులైన వారికి బియ్యం కార్డులు, ఇతరులకు స్మార్ట్ కార్డులు జారీ
- జూన్‌లో డిజిటల్ కార్డులు QR కోడ్‌తో పంపిణీ
🔹 ప్రత్యేకంగా లభించే సౌకర్యాలు
👉 కొత్త సభ్యుల చేర్పు
👉 కుటుంబ విభజన
👉 చిరునామా మార్పు
👉 చనిపోయిన వారి పేర్ల తొలగింపు
👉 రేషన్ కార్డు స్వచ్ఛందంగా వదిలే అవకాశం
ఒంటరి మహిళలు, ఆశ్రమాల్లో నివసించే వారు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈసారి కార్డులు అందుబాటులో ఉండనున్నాయి.
📌 గమనిక: ఆధార్ చిరునామాకు కార్డులను కొరియర్ ద్వారా పంపే యోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త స్మార్ట్ కార్డుల ముందు భాగంలో కార్డు నంబర్, యజమాని ఫోటో, QR కోడ్ ఉంటాయి. వెనుక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు, పుట్టిన తేదీలు, సంబంధం, చిరునామా వంటి వివరాలు ఉంటాయి
tags:
AP Ration Card 2025, AP Smart Ration Card Apply, Mana Mitra Ration Card, AP Govt Ration Update, QR Code Ration Card, Andhra Pradesh Welfare News
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇