Pension Verification: ఆరు నెలల్లో 1.60 లక్షల పింఛన్లపై వేటు

Pension Verification: ఆరు నెలల్లో 1.60 లక్షల పింఛన్లపై వేటు

Ap Pension Verification :: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా బోగస్ పెన్షన్లు ఉన్నాయని ఉద్దేశంతో అన్ని పెన్షన్స్ రీ వెరిఫికేషన్ కి ఆర్డర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు పెన్షన్స్ వెరిఫికేషన్ చేస్తున్నారు.. అయితే తాజాగా వచ్చిన ఈరోజు న్యూస్ చూద్దాం.. మీకేమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు..

పింఛన్లపై వేటు

  • ఆరు నెలల్లో 1.60 లక్షల కోత

రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛన్లపై ప్రభుత్వం వేటువేస్తోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సామాజిక పింఛన్లను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, కుడి చేత్తో పెంచి ఎడమ చేత్తో ప్రభుత్వం కోత పెడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అనర్హుల ఏరివేత పేరిట ఈ ప్రక్రియ సాగుతోందన్నది ప్రధాన విమర్శ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తాజాగా ‘న్యూస్ మినిట్’ వెబ్సైట్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఆరు నెలల కాలంలో 1.60 లక్షల పింఛన్లపై వేటు పడినట్లు ఒక కథనాన్ని ప్రచురించింది. దేశ వ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును (పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ విధానం)ను అధ్యయనం చేసే ‘లిబెక్ ఇండియా’ విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆ సంస్థ పేర్కొంది.

Also Read ::- హైకోర్టులో ఉద్యోగాలు ( పరీక్ష లేదు, ఫీజు లేదు )

Today Updates
Today Updates: రైతులకు 10 వేలు, వీరికి 25 వేలు వెంటనే తెలుసుకోండి. లేక పోతే నష్టపోతారు!

ఇంజినీర్లు, సామాజిక కార్యకర్తలు కలిసి పింఛన్ల డాటాను క్రమం తప్పకుండా ట్రాక్ చేయడం ద్వారా ఈ గణాంకాలను రూపొందించారని తెలిపింది. ఈ కథనం ప్రకారం 2024 జూన్ నెలలో రాష్ట్రంలో 65.5 లక్షల సామాజిక పింఛన్లు పంపిణీఅవుతుండగా, డిసెంబర్ నెలాఖరుకు ఆ సంఖ్య 63,92,702కు తగ్గింది. అంటే దాదాపుగా 1.60 లక్షల మేరకు పింఛన్లపై కోత పడింది.

ఆరు నెలల కాలంలోనే ఈ స్థాయిలో కోత పెట్టడం అనూహ్యమన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అయితే, పింఛన్ల కోత ఒక క్రమ పద్ధతి ప్రకారం జరుగుతోందని, ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల ఉంటోందని ‘లిబెక్ ఇండియా’ పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పింఛన్లపై టిడిపి కూటమి నాయకులు మొదటి నుండి అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే డిసెంబరు 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక సచివాలయాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.

Also Read ::- రైతులకు గుడ్ న్యూస్ 2 వేల పీఎం కిసాన్ స్టేటస్

ఈ సర్వేలో 10,958 మంది పింఛన్దారులను పరిశీలిస్తే ఐదు శాతం మందిని అనర్హులుగా సర్వే టీమ్లు గుర్తించాయి. దీనినే పేర్కొంటూ రాష్ట్రం మొత్తం మీద 3.2లక్షల మంది అనర్హులు పించన్ పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు కొద్దిరోజుల క్రితం అంచనా వేశాయి. వీటి కారణంగా ప్రతి నెలా రూ.120 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పింఛన్ల సంఖ్య తగ్గుతుండటం గమనార్హం.

Ration Card Download Online 2025
Ration Card Download Online 2025: మీ మొబైల్ లోనే ఫ్రీగా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి!

📢 Related TAGS

ap pension verification, ntr bharosa pension, pension verification, ntr bharosa pension application, ntr bharosa pension status, ntr bharosa pension online, ntr bharosa pension scheme, ntr bharosa pension in ap, pensioner verification

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now