Ap New Ration Card Update Ap లో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ

Ap New Ration Card Update Ap లో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ

Ap New Ration Card :: ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రేషన్ కార్డుకు సంబంధించి వాయిదా వేస్తూ వస్తుంది.. ఐతే ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం… ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సప్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.

కొత్త జంటలకు రేషన్ కార్డులు

రాష్ట్రంలో నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్ పోర్టల్ తెరవనుంది. దీంతోపాటు రేషన్ కార్డు రూపురేఖల్ని పూర్తిగా మార్చనుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

క్రెడిట్ కార్డు తరహాలో.. క్యూఆర్ కోడ్ తో వీటిని జారీ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గానీ ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

2 లక్షల మందికి రేషన్ కార్డులు

రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. నవ దంపతుల నుంచి అందిన దరఖాస్తులు సుమారు 70 వేలకు పైగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులు కూడా కలిపితే 2 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు 1. 50 కోట్లకు చేరే అవకాశం ఉంది.

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులు వైకాపా రంగుల్ని పోలి ఉన్నాయి. జగన్ బొమ్మలతో ఇచ్చారు. వాటిని సమూలంగా మార్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రెడిట్ కార్డును పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేయించారు. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా రూపొందించారు. సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుంది.

Today Updates
Today Updates: రైతులకు 10 వేలు, వీరికి 25 వేలు వెంటనే తెలుసుకోండి. లేక పోతే నష్టపోతారు!

గతేడాది డిసెంబరులో నే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని.. సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలని ప్రాథమికంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు రెవెన్యూ సదస్సుల్లో నిమగ్నమవ్వడం, ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతుండడంతో కార్డులకు దరఖాస్తులు తీసుకునే ప్రక్రియను వాయిదా వేశారు.

దరఖాస్తు చేసుకున్న వెంటనే కొత్త రేషన్ కార్డు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినా.. కొద్ది రోజులకే దాన్ని పక్కన పెట్టారు. ఆరు నెలలకోసారి ఇస్తా మంటూ తిరకాసు పెట్టారు

రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు.. ఏడా దిగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.

కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకూ అనుమతించలేదు. దీంతో వేలాదిమంది ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించలేకపోయారు. ఇదే సమయంలో ఆన్లైన్ దరఖాస్తుల విధానాన్ని నిలిపివేశారు. వీటన్నిటికీ పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

విద్యా ఉద్యోగ తాజా సమాచారం కొరకు :: Click Here

పింఛన్లపై వేటు
Pension Verification: ఆరు నెలల్లో 1.60 లక్షల పింఛన్లపై వేటు

Also Read ::- 2 నిమిషాల్లో ఫ్రీ గా రేషన్ కార్డు PDF డౌన్లోడ్ చేసుకోండి..

📢 Related TAGS

ap new ration card, how to apply new ration card in ap, ap new ration card update, ap latest ration card news, how to apply new ration card, how to apply ap new ration card online, ration card, ration cards updates, ap ration card, ap ration cards latest news 2025, new ration cards issued in ap, ration card online apply

Also Read ::- బోగస్ పెన్షన్ వెరిఫికేషన్ లేటెస్ట్ న్యూస్

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now