Table of Contents
Ration Dealer Jobs Notification 2025: ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్!
Ration Dealer Jobs :: ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు డివిజన్లలో రేషన్ డీలర్ల నియమకానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ పూర్తి వివరాలు పేజీలో తెలుసుకుందాం..
రేషన్ డీలర్స్ నోటిఫికేషన్ 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం డివిజన్ లో 107 రేషన్ డీలర్ పోస్టుల ( Ration dealer jobs ) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 23, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. శ్రీకాకుళం డివిజన్‌లలో 107 రేషన్ డీలర్లు మరియు దుకాణాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియలో వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది.
మొత్తం రేషన్ డీలర్ల పోస్టులు
శ్రీకాకుళం డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 107 రేషన్ డీలర్లు దుకాణాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు రెవెన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం శ్రీకాకుళం నుండి తెలిపారు. ఏ మండలంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి క్రింది టేబుల్ లో క్లియర్ గా ఇచ్చాను చూడండి.
S.no | మండలం | దుకాణాల సంఖ్య |
1 | ఆమదాలవలస | 8 |
2 | బూర్జ | 3 |
3 | ఎట్ చెర్ల్ | 5 |
4 | G. సింగాడం | 5 |
5 | జలుమూరు | 3 |
6 | లావేరు | 15 |
7 | నరసన్నపేట | 12 |
8 | పోలాకి | 12 |
9 | Ponduru | 16 |
10 | రణస్థలం | 10 |
11 | Sarubujji | 4 |
12 | శ్రీకాకుళం | 14 |
విద్యార్హతలు
- శ్రీకాకుళం రెవిన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లు, విభజిత దుకాణాల భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ విద్యార్హతగా నిర్ణయించారు.
- డీలర్ పోస్టుకు, దుకాణానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి.
- వీరిపై ఎలాంటి పోలీస్ కేసులు ఉండకూడదు.
- అలాగే చదువుకుంటున్న వారు, విద్యా వాలంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు, ఆశా కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
Also Read :- నిరుద్యోగులకి గుడ్ న్యూస్ ( సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు )
వయస్సు
- ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 18 సంవత్సరాలనుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
- రిజర్వుడు కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయించిన ప్రకారం మినహాయింపు ఉంటుంది.
అప్లై చేసుకునే విధానం
తేదీ 23-1-2025, సాయంత్రం 5 గంటలలోపు అర్హత కలిగిన మరియు ఆసక్తిగల నిరుద్యోగ అభ్యర్థులు శ్రీయుత రెవిన్యూ డివిజన్ అధికారి, కార్యాలయం ఆవరణ, శ్రీకాకుళం వారికి దరఖాస్తులు చేసుకొనవలెను. దరఖాస్తు ఫారం ను సంబంధించిన సచివాలయం నుండి లేదా సంబంధిత తాసిల్దార్ వారి కార్యాలయం నుండి .. లేదా రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం శ్రీకాకుళం నందు గాని ఉచితంగా పొందవచ్చును.
ఆ దరఖాస్తు నందు అన్ని వివరములు ఫిల్ చేసి, గెజిటెడ్ అధికారి చే అటెస్టు చేయించిన అన్ని ధ్రువీకరణ పత్రములు జత చేసి దరఖాస్తుతో పాటుగా ఎంపిక ప్రక్రియ కోసం నిర్ణయిత రుసుము. రూ 600 రూపాయలు రెవెన్యూ డివిజన్ అధికారి, శ్రీకాకుళం పేరు నా చెల్లించి. మూడు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు జత చేసి ఈ క్రింది అడ్రస్ కు దరఖాస్తు కవర్ పై రేషన్ డిపో డీలర్ నియామకం కొరకు దరఖాస్తు అని వ్రాస్తూ రేషన్ డిపో నెంబర్.. డీలర్ నియామకమునకు దరఖాస్తు చేయబడుతున్నదని తెలుపవలెను.
చిరునామా…
రెవెన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం, శ్రీకాకుళం- 532001
కావలసిన దృవీకరణ పత్రాలు
ఈ ( Ration dealer jobs ) పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే,, క్రింద చెప్పిన ప్రతి డాక్యుమెంటు తప్పనిసరిగా కావలెను.
- పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు
- వయసు ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం ( ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఏదైనా పర్లేదు )
- మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధ్రువీకరణ పత్రం
- దివ్యాంగులు అయితే ఆ కేటగిరికి సంబంధించిన సదరం సర్టిఫికెట్
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ తేదీ | 02-01-2025 |
దరఖాస్తు చేసుకోవలసిన ఆఖరి తేదీ | 23-01-2025 |
హాల్ టికెట్ జారీ చేయు తేదీ | 31-01-2025 |
రాత పరీక్ష జరుగు తేదీ | 05-02-2025 |
రాత పరీక్ష జరుగు ప్రదేశం | ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ( పురుషులు ) శ్రీకాకుళం |
మౌలిక పరీక్ష / ఇంటర్వ్యూ జరుగు తేది | 09-02-2025 |
మౌలిక పరీక్ష / ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం | రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం శ్రీకాకుళం |
Also Read ::- 10వ, ఇంటర్, డిగ్రీ, ఐటీ అందరికీ జాబ్స్ ( జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు )
రేషన్ డీలర్ నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్
ఈ క్రింద ఇచ్చిన టేబుల్ ని క్లిక్ చేసుకొని రేషన్ డీలర్ కు సంబంధించి గవర్నమెంట్ వారిచే వచ్చిన నోటిఫికేషన్.. మరియు అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.
రేషన్ డీలర్స్ నోటిఫికేషన్ పిడిఎఫ్ | Click Here |
అప్లికేషన్ ఫామ్ ( అప్లై చేయడానికి ) | Click Here |
🔍 Related TAGS
ration dealer jobs, ration shop dealer jobs, ration dealer jobs news, ration dealer jobs update, ration dealers, andrapradesh ration dealer jobs, ration dealers notification
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇