దివ్యాంగ పెన్షన్లు తనిఖీ : ap pension verification 2025

Ap pension verification

దివ్యాంగ పెన్షన్లు తనిఖీ : AP Pension Verification 2025

Ap Pension Verifications :: గత కొంతకాలంగా ఏపీలో ఎక్కువగా బోగస్ పెన్షన్లు ఉన్నాయని ఉద్దేశంతో.. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ ప్రారంభం అవడం జరిగింది.. ఇప్పటికే కొన్ని పెన్షన్లు వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది..

ఇప్పటికే వెరిఫికేషన్ ప్రారంభం

  • అనర్హులు పొందుతున్న పెన్షన్లను సోమవారం (06.01.25) నుంచి ప్రభుత్వం తనిఖీ ప్రారంభించింది.
  • మంచానికే పరిమితమై రూ.15వేల పెన్షన్ తీసుకుంటున్న 24 వేల మంది ఇళ్లకు వెళ్లి వైద్య బృందాలు పరీక్షలు చేస్తున్నారు.
  • నెలకు రూ.6వేలు తీసుకుంటున్న 8 లక్షల మంది దివ్యాంగులకు దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేస్తారు.
  • పెన్షన్ దారులు హాజరు కాకపోయినా, బృందం ఇంటికి వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోయినా వాళ్ల పెన్షన్ హోల్డ్లో పెడతారు.

655 మందిలో 374 మందే?

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 655 మంది దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికి పరిమితమై.. పింఛన్లు పొందేవారి జాబితాలో ఉన్నారు. వైద్యబృందాలు వారి గ్రామాలకు వెళ్లి, వైద్యపరీక్షలు చేయగా 374 మందే రూ.15 వేల చొప్పున పింఛను పొందేందుకు అర్హత కలిగి ఉన్నట్లు తేలింది. 255 మందికి వైక్యలం ఉన్నా. వారు నెలకు రూ. 6వేల చొప్పున పింఛను తీసుకునేందుకే అర్హులు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మరో 26 మందికి ఆరోగ్య సమస్యలేమీ లేవు. వీరు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి, పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ‘ ‘పింఛన్ల మొత్తం పెంచిన అనంతరం 190 మంది తమను రూ.15వేల జాబితాలోకి మార్చాలని విజ్ఞప్తులిచ్చారు. దీంతోపాటు పింఛనుదారుల్లో అనర్హులున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐదు వైద్య బృందాలను ఏర్పాటు చేసి, 40 రోజులపాటు వైద్యపరీక్షలు చేయించాం. అనర్హులను గుర్తించి, వారి పేర్లను జాబి తాల నుంచి తప్పించాం’ అని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ‘ తెలిపారు..

Also Read ::- Ap లో రేషన్ డీలర్ల జాబ్స్ రిలీజ్

Today Updates
Today Updates: రైతులకు 10 వేలు, వీరికి 25 వేలు వెంటనే తెలుసుకోండి. లేక పోతే నష్టపోతారు!

పెన్షన్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు?

ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది కొంతమందికి లబ్ధిదారుల ఇంటి దగ్గరికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తారు.. ఇంకొంతమందికి ఆస్పత్రులలో పరీక్షలు నిర్వహిస్తారు.. ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం..

ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్

ఈ క్రింద తెలిపిన వారికి ఇంటింటికి వెళ్లి పెన్షన్ వెరిఫికేషన్ చేస్తారు..

  • పక్షవాతం వ్యక్తిని చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం (16,479 మంది పెన్షనర్లు),
  • తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, ప్రమాద బాధిత (7,612 మంది) పెన్షనర్ల ఇంటింటికి వెళ్లి వైద్య బృందం వెరిఫికేషన్ చేస్తుంది.
  • నెలకు రూ.15,000 పెన్షన్ అందుకుంటున్న 24,091 మంది పెన్షనర్ల ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తారు.
  • ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్స్, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ వెరిఫికేషన్ చేస్తారు.

ఆసుత్రుల్లో వెరిఫికేషన్

  • రూ. 6,000 పెన్షన్ అందుకుంటున్న దివ్యాంగుల పెన్షనర్లకు వైద్య బృందం వెరిఫికేషన్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో నిర్వహిస్తారు.
  • లోకోమోటర్/ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ (4,63,425), దృష్టి లోపం (90,302), వినికిడి లోపం (1,09,232), మెంటల్ రిటార్డేషన్ (1,03,042), మానసిక అనారోగ్యం (19,193), మల్లీపుల్ డిజిబులిటీ (2,782) మంది పెన్షనర్లు ఉన్నారు.
  • అలాగే మల్టీడిఫార్మిటీ లెప్రసీ (6,833) మంది పెన్షనర్లు ఉన్నారు. ఆర్థోపెడిక్స్, సూపరింటెండెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ వెరిఫికేషన్ చేస్తారు.

ఏ అధికారులు వెరిఫికేషన్ చేస్తారు?

  • ప్రతి మెడికల్ టీంతో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్‌ను జిల్లా కలెక్టర్‌ జత చేస్తారు.
  • జిల్లా స్థాయిలోషెడ్యూల్‌ను జిల్లా స్థాయి సమన్వయ కమిటీ రూపొందిస్తుంది.
  • మండల, మున్సిపాలటీ స్థాయిల్లో షెడ్యూల్‌ను రూపొందిస్తారు.
  • మెడికల్ టీంను కూడా జిల్లాస్థాయి సమన్వయ కమిటీనే నియమిస్తుంది.
  • ఒక మెడికల్ టీం ప్రతి రోజు కనీసం 25 పెన్షనర్లను వెరిఫై చేయాల్సి ఉంటుంది.

  • ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్లు గ్రామ, వార్డు సచివాలయాల వారీగా షెడ్యూల్‌ను తయారు చేసి, జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి.
  • తేదీలువారీగా ఆయా పెన్షనర్ల మ్యాపింగ్ జరిగేలా చూసుకోవల్సిన బాధ్యత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లదే.
  • పెన్షన్స్‌ను మొబైల్ అప్లికేషన్ ద్వారా వెరిఫికేషన్ చేస్తారు.
  • వెరిఫికేషన్ అయిన పెన్షన్లలలో 5 శాతం ర్యాండమ్‌గా వెరిఫికేషన్ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఒక టీంను ఏర్పాటు చేస్తారు.

Also Read ::- నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రైల్వేలో ఉద్యోగాలు రిలీజ్

అసలు ఎందుకు పెన్షన్స్ వెరిఫికేషన్ చేస్తున్నారు?

ప్రధానంగా మనకి రెండు కారణాలు ఉన్నాయి..

పింఛన్లపై వేటు
Pension Verification: ఆరు నెలల్లో 1.60 లక్షల పింఛన్లపై వేటు
  1. ఎక్కువగా బోగస్ పెన్షన్లు ఉన్నాయని ( ఈ బోగస్ పెన్షన్లు ఉండడం వలన అర్హత లేకున్నా కానీ ఎక్కువమంది పెన్షన్లు తీసుకుంటున్నారు.. ఇలా తీసుకోవడం వల్ల నిజమైన వారికి పెన్షన్ అందడం లేదు.. అలాగే బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుందని కారణంతో.. అర్హత ఉండేవాళ్ళకే పెన్షన్స్ ఇవ్వాలని.. కూటమి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది.. అందుకే ప్రస్తుతం ఏపీలో పెన్షన్ వెరిఫికేషన్ ప్రారంభమైంది.
  2. ఇంకో ప్రధాన కారణమేంటంటే గత వైసిపి ప్రభుత్వం లో ఎక్కువమంది బోగస్ పెన్షన్ తీసుకున్నారనే కారణంతో అనర్హులకు తొలగించి నిజమైన అర్హులకు పెన్షన్ ఇవ్వాలని ఉద్దేశం.

మరింత సమాచారం కోసం మమ్మల్ని వాట్సాప్ లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చును.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now